Abn logo
Apr 22 2021 @ 01:19AM

ఆర్టీసీ అద్దె బస్సు బోల్తా

 త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

ప్రయాణికులకు స్వల్పగాయాలు

గుడివాడ, ఏప్రిల్‌ 21 : గుడివాడ డిపోకు చెందిన గుడివాడ- విజయవాడ ఆర్టీసీ పల్లె వెలుగు అద్దె బస్సు ఉంగుటూరు మండలం మానికొండ వద్ద బోల్తా కొట్టింది. విజయవాడ నుంచి గుడివాడ వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి బస్సు మార్జిన్‌ దిగడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయట పడ్డారు.  కాలువలో నీరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement