Abn logo
Mar 6 2021 @ 11:53AM

వీడియో గేమ్‌లు ఆడుతూ జగన్ కాలయాపన: బాలయ్య

అనంతపురం: సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వీడియో గేమ్‌లు ఆడుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.  హిందూపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను ఉన్న మూసివేసి ప్రజల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత ఒక్క తెలుగుదేశంకే దక్కుతుందన్నారు.  బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. నలుగురు మంత్రులు చంద్రబాబు నాయుడుని విమర్శించడమే పని పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారని యెద్దేవా చేశారు. చంద్రబాబును బూతులు తిట్టేందుకు ఒక మంత్రిని నియమించారన్నారు. రెండేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని... అందుకే పోలీసులు, వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement