Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైవే ప్రయాణిలకు ఆహారపొట్లాల పంపిణీ

మనుబోలు, డిసెంబరు 1: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచనలతో మనుబోలులో బుధవారం హైవే ప్రయాణికులకు మనుబోలు టీడీపీ నాయకులు ఆహారపొట్లాలు అందజేశారు. నాలుగురోజులుగా ఆదిశంకర కళాశాల వద్ద వరద ప్రవాహం వలన ట్రాఫిక్‌ అంతరాయం కలుగుతోంది. దీంతో వేలాది వాహనాల్లో ఉన్న ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో లారీలు, బస్సుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, వాహన చోదకులకు, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు టీడీపీ నాయకులు తమ వంతు సాయంగా ఆహార పొట్లాలు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్‌ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్‌, నలగర్ల వెంకయ్య యాదవ్‌, రాయపాటి కిరణ్‌కుమార్‌, చింతల వెంకటేశ్వర్లు, మారంరెడ్డి రమణారెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, ఉచ్చూరు లక్ష్మీనరసారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement