Abn logo
Jun 3 2020 @ 04:01AM

మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు

కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి


కీసర/కీసర రూరల్‌/శామీర్‌పేట: మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం నిధుల ద్వారా కీసరలో సీసీరోడ్డు, అంతర్గత మురుగు కాలువ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరానికి అతి చేరువలో ఉన్న శివారు గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. 


పట్టణ ప్రగతితో మారనున్న రూపురేఖలు 

పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోతాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణప్రగతిలో భాగంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్‌గూడలోని ప్రధాన రహదారి వెంట జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం నాలుగో వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్‌, జనార్దన్‌రెడ్డి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, అదనపు కలెక్టర్లు విద్యాసాగర్‌ పాల్గొన్నారు.


 రహదారిని హరితవనంగా తీర్చిదిద్దుతాం

హకీంపేట నుంచి తుర్కపల్లి వరకు గల రాజీవ్‌ రహదారిని హరితవనంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తూంకుంట మునిసిపల్‌ పరిధిలో గల రాజీవ్‌ రహదారిలో మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలను నాటారు. మంత్రి మాట్లాడుతూ త్వరలో కే శ్వాపూర్‌ తాగునీటి ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. శామీర్‌పేటలో రైతు కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement