- రెవెన్యూ అధికారులను నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్ : చట్ట నిబంధనలు పాటించకుండా ప్రహరీ, సర్వెంట్ క్వార్టర్స్ కూల్చివేతలు ఎలా చేపడతారని హైకోర్టు డివిజన్ బెంచ్ రెవెన్యూ అధికారులను నిలదీసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా కూల్చివేత నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది. శేరిలింగంపల్లి మండలం, సర్వే నెం.44/1లో 2415 చ.గ. స్థలాన్ని ఎం. బాపిరాజు అనే వ్యక్తి 2004లో కొనుగోలు చేశారు. అప్పటికే ఈ స్థలం చుట్టూ ప్రహరీ, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశాడు. రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని చెబుతూ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ ఖర్చుతో ఆరు నెలలల్లోగా తిరిగి నిర్మించాలని, పిటిషనర్‌కు కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది వివరణ ఇస్తూ... ఈ వ్యాజ్యంలో అదనపు ఏజీ హాజరవుతారని, గడువు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం విచారణను మార్చి 17కి వాయిదా వేసింది.