Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోర్టు భవనాలను పరిశీలించిన హైకోర్టు జడ్జి

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 27 : ప్రొద్దుటూరు కోర్టు భవనాలను శనివారం హైకోర్టు జడ్జి బి.కృష్ణమోహన్‌ పరిశీలించారు. న్యాయస్థానాలకు సంబంధించి సిబ్బంది నియామక పరీక్షలు శనివారం స్థానికంగా పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరిగాయి. ఈ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంలోనే ఆయన ప్రొద్దుటూరు కోర్టు సముదాయానికి రాగా ఇక్కడి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోర్టు భవనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. హైకోర్టు జడ్జి వెంట జిల్లా జడ్జి పురుషోత్తంకుమార్‌, ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి పి.వాసు, సీనియర్‌ సివిల్‌ జడ్జి శివప్రసాద్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రత్నప్రసాద్‌, ఫస్ట్‌ ఏడీఎం ప్రతిభ, సెకండ్‌ ఏడీఎం మేరీసారాదానమ్మ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement