Abn logo
Jun 22 2020 @ 14:57PM

జుట్టు ఎక్కువగా రాలుతుందా..?

ఆంధ్రజ్యోతి(22-06-2020)

ప్రశ్న: నాకు ఇరవైమూడేళ్లు. జుట్టు వత్తుగా ఉండేది. ఇటీవల జుట్టు రాలడం ఎక్కువైంది. ఆహారం ద్వారా సమస్యకి పరిష్కారం దొరుకుతుందా?


- అనిల్‌, కరీంనగర్‌ 


డాక్టర్ సమాధానం: వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, నిద్ర లేమి; ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా పలు రకాల కారణాల వల్ల జుట్టు రాలుతుంది. నిపుణులను సంప్రదించి కారణం తెలుసుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు తప్పకుండా తీసుకోండి. అలాగే, మాంసాహారంతో పాటుగా పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు అవసరం. వీటిలో ఉన్న ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఉండడానికి, ఆరోగ్యంగా పెరగడానికి అత్యవసరం. అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసె గింజలు మొదలైన వాటిల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు సమస్య నివారణకు కొంత ఉపయోగపడతాయి. మీ జీవన విధానంలో ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది. రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఎంతో అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)