Abn logo
Sep 27 2020 @ 22:19PM

యాంకర్‌గా మారుతున్న హీరోయిన్.. ఎవరంటే?

Kaakateeya

హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించిన వితికా శెరు.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతోంది. హీరో వరుణ్‌ సందేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వితిక.. బిగ్‌బాస్ సీజన్‌ 3లో తన భర్తతో కలిసి పాల్గొంది. ఆ షో కి ముందు అంతగా వార్తలలో లేని వితిక.. ఆ తర్వాత అప్పుడప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉంది. రీసెంట్‌గా ఆమె బిగ్‌బాస్‌పై చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతోన్నట్లుగా తెలుపుతూ.. సోషల్‌ మీడియాలో వితిక ఓ పోస్ట్ చేసింది.

ఇంతకీ వితిక కొత్త అవతారం ఏమిటని అనుకుంటున్నారా? పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేసిన వితిక.. ఇప్పుడు యాంకర్‌గా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. బుల్లితెరపై ప్రసారం కాబోతోన్న ఓ మ్యూజికల్‌ షోకి ఆమె యాంకర్‌ బాధ్యతలను స్వీకరించినట్లుగా తెలిపింది. బుల్లితెరపై మిమ్మల్ని యాంకర్‌గా కలుసుకోబోతున్నందుకు చాలా ఎగ్జయిట్‌ అవుతున్నానని వితిక తన పోస్ట్‌లో పేర్కొంది.


Advertisement
Advertisement
Advertisement