Abn logo
May 27 2020 @ 22:42PM

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీకి హీరోయిన్ ఫిక్సయిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించే చిత్రం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మూవీ ప్రకటన మాత్రం వచ్చింది. ఈ లాక్‌డౌన్‌లో ఇతర నటీనటులను కూడా త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం.


ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా సమంత నటించబోతుందట. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత సినిమాలు చేసి ఉంది. అలాగే ఎన్టీఆర్‌తో కూడా సమంత సినిమాలు చేసింది. మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు పెరగడం ఖాయం. అందులో ఈ మధ్య సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రాలే చేస్తుంది. మళ్లీ స్టార్ హీరో సరసన ఆమె చేసేందుకు అంగీకరించిందనే వార్త.. సమంత అభిమానులకే కాక నందమూరి అభిమానులకు కూడా మంచి కిక్ ఇస్తుంది. ఎందుకుంటే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ అలా ఉంటుంది మరి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Advertisement
Advertisement
Advertisement