దళపతి విజయ్ నటించనున్న 65వ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే, ఈ చిత్రంలో ఒకటి లేదా రెండు పాటలను హీరో శివకార్తికేయన్ రాయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. గతంలో శివకార్తికేయన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కోలమావు కోకిల’ అనే చిత్రంలో ‘కళ్యాణ వయసు’ అనే పాటను శివకార్తికేయన్ రాయగా ఆ పాట సూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత నెల్సన్ దర్శతక్వంలో తాను నటించిన ‘డాక్టర్’ చిత్రంలోనూ ‘సో బేబీ’, ‘చెల్లమ్మా’ అనే పాటలకు గేయరచన చేశారు. ఇప్పుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కోరిక మేరకు విజయ్ నటించే 65వ చిత్రానికి శివకార్తికేయన్ ఒకటిరెండు పాటలు రాయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’, ‘అయలాన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.