Abn logo
Jul 13 2020 @ 20:50PM

ట్విట్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన హీరో కార్తికేయ

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘గుణ 369’ చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపును ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆయనను ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయగానే ప్రేక్షకులు చెప్పుకుంటున్నారంటే.. ఆ సినిమా ఇంపాక్ట్ అలాంటిది మరి. ఒక్క కార్తికేయ అనే కాదు, ఆ చిత్రంతో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌ను కూడా ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ అనే సంబోధిస్తున్నారు. తాజాగా హీరో కార్తికేయ ట్విట్టర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ట్వీట్ చేశారు.


‘నేనూ చిన్నపాటి సెలబ్రిటీనే అని గుర్తించిన ట్విట్టర్‌‌కి కృతజ్ఞతలు’ అని కార్తికేయ ట్వీట్ చేశారు. కార్తికేయను సెలబ్రిటీగా గుర్తిస్తూ అధికారిక హోదా అంటే బ్లూ టిక్‌ను ట్విట్టర్ యాడ్ చేసింది. దీంతో కార్తికేయ ట్విట్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఆయన నటించిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్తికేయ వరుస ట్వీట్స్ చేస్తూ.. అందరికీ ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో కార్తికేయ కూడా యాక్టివ్‌గానే ఉంటూ ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా కార్తికేయను సెలబ్రిటీగా ట్విట్టర్ గుర్తించడంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement