Advertisement
Advertisement
Abn logo
Advertisement

హీరో ఇంట విషాదఛాయలు

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఆర్‌ కల్యాణమండపం హీరో సోదరుడు మృతి

సంబేపల్లె, డిసెంబరు 1:
ఎస్‌ఆర్‌ కల్యాణమండపం హీరో అబ్బవరం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంట బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇతని సోదరుడు అబ్బవరం రామాంజుల్‌రెడ్డి (35) మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వారి బంధువుల సమాచారం మేరకు.. రామాంజుల్‌రెడ్డి స్వస్థలం కడప జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్లపల్లె. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రామాంజుల్‌రెడ్డి ఎర్రగుంట్ల మండలంలోని భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన ద్విచక్రవాహనంలో సిమెంటు ఫ్యాక్టరీ వద్దకు వెళుతుండగా ఎర్రగుంట్ల మండలం పందిళ్లపల్లె వద్ద గేదెను ఢీకొనడంతో కిందపడి అపస్మారకంలోకి వెళ్లాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మొదట ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. నేడు స్వగ్రామమైన పెద్దకోడివాండ్లపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలైన మొట్టమొదటి సినిమా ఎస్‌ఆర్‌ కల్యాణమండపం. ఇందులో రామాంజుల్‌రెడ్డి సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి హీరోగా నటించడంతో పాటు కథ, మాటలు సమకూర్చారు.

రామాంజుల్‌రెడ్డి (ఫైల్‌ఫోటో)


Advertisement
Advertisement