Abn logo
Sep 21 2021 @ 00:00AM

తిండి మీద యావ ఇందుకే

ఒక్కోసారి తీయని గులాబ్‌జామూన్‌ గుట్టుక్కుమనిపించాలనిపిస్తుంది. ఇంకోసారి కరకరలాడే జంతికలు లాగించాలనిపిస్తుంది. మరోసారి గరం మసాలా దట్టించిన నాన్‌ వెజ్‌ స్నాక్స్‌ పని పట్టాలనిపిస్తుంది. ఇలా భిన్న రుచుల మీదకు మనసు మళ్లడానికి కారణం మనలో లోపించే పోషకాలే! ఆ పోషకాలను భర్తీ చేసే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇదిగో ఇలా తెలివిగా ఎంచుకోవాలి.


 చీజ్‌: చీజ్‌ బర్గర్‌ లేదా పిజ్జా తినాలనిపిస్తే మనలో ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్లు లేదా క్యాల్షియం లోపం ఏర్పడిందని అర్థం. ఫ్యాటీ యాసిడ్లను అవిసె గింజలు, సబ్జా విత్తనాలు, వాల్‌నట్స్‌తో, క్యాల్షియంను నువ్వులతో భర్తీ చేయవచ్చు.


 పాస్తా, వైట్‌ బ్రెడ్‌, పేస్ట్రీ: క్రోమియం లోపానికి సూచన ఇది. ఈ లోపాన్ని ద్రాక్ష, యాపిల్స్‌, చిలగడ దుంపలతో భర్తీ చేయవచ్చు.


 ఉప ్పటి పదార్థాలు: క్లోరైడ్‌ లోపంతో ఉప్పుతో కూడిన చిప్స్‌, నట్స్‌ తినాలనిపిస్తుంది. ఆలివ్స్‌, టమాటో, హిమాలయన్‌ సాల్ట్‌లతో ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.


 చాక్లెట్‌: మెగ్నీషియం లోపానికి సూచన ఇది. పొట్టు తీయని ధాన్యాలు, బీన్స్‌, నట్స్‌, సీడ్స్‌, పండ్లతో ఈ లోపాన్ని భర్తీ చేసుకుంటే చాక్లెట్ల మీద యావ తగ్గుతుంది.


 స్వీట్లు: రక్తంలో చక్కెర స్థాయి తగ్గే పరిస్థితి హైపోగ్లైసీమియా లక్షణం ఇది. అలాగని స్వీట్లు లాగించేయకుండా పండ్లు ఎంచుకోవాలి. చిక్కుళ్లు, కాంప్లెక్స్‌ కార్బ్స్‌తో కూడిన పొట్టుతో కూడిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకుంటే స్వీట్ల మీదకు మనసు మళ్లదు. 


ప్రత్యేకం మరిన్ని...