Abn logo
Sep 27 2020 @ 12:10PM

‘‘మా అమ్మానాన్నలను స్పాట్‌లోనే ఎన్‌కౌంటర్ చెయ్యండి’’

Kaakateeya

హైదరాబాద్: నగరంలో జరిగిన పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆమె.. ‘‘మా అమ్మానాన్నలను స్పాట్‌లోనే ఎన్‌కౌంటర్ చెయ్యండి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి.. ‘‘కేసీఆర్ సార్, జగన్ సార్ నాకు న్యాయం చేయండి. కేటీఆర్ సార్ నాకు న్యాయం చేయండి. మీరంతా నాతో ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. 


‘‘ఇంట్లో ఒప్పుకోము మేము... అలాంటి ఆలోచన ఉంటే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని మా అమ్మ చెప్పింది. నా ఇష్టపూర్వకంగా నేను వచ్చాను. మా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నాం. అందుకే ప్రతి ఒక్కటి ముందుజాగ్రత్తతో వెళితేనే బాగుంటుందనే ఆలోచనతో అన్నిటిని ప్రణాళికబద్దంగా చట్టబద్ధంగా హేమంత్ చేసుకువచ్చాడు. ఎవరినీ మాటతో కూడా నొప్పించడు. వాళ్లంతా బాస్టర్డ్స్... జీవితకాలం ఈ బాధ నాకు ఉంటుంది. ఎందుకు అలా జరగుతుందో అతనికి తెలియకుండా జరిగిపోయింది. అంత ఈజీగా వదిలేయను. సహృదయుడు. మీరంతా నాతో ఉండాలి. వాళ్లు ధనబలం చూపిస్తారు. పది లక్షలు ఖర్చు పెట్టారు. నేను పదికోట్లు ఇస్తాను. బతికిస్తారా? అని ప్రశ్నించింది.  


ఎనిమేదేళ్ల నుంచి నాకు హేమంత్‌తో పరిచయం ఉంది. ఇంటర్ చదువుతున్నప్పుడే చెప్పడం మొదలుపెట్టారు. ఇలా చేయొద్దని నాన్న నాతో చెప్పారు. నేను వినలేదు. అప్పటికే నాకు అతనితో బంధం బలపడింది. తర్వాత ఫోన్ బిల్లు పెరగడంతో అనుమానమొచ్చి.. మా బావ వాళ్లు నాకు చెప్పారు. నవంబర్ 27న మరోసారి ఇంట్లో తెలిసింది. ఆతర్వాత  ఇంట్లో బంధించారు. తర్వాత ఈ మూడు నెలల్లో అంతా జరిగిపోయింది. ఏ లోటు లేకుండా డిజైన్ చేసుకున్నాం. ఇంటికి వస్తారని ఊహించాడు. అంత దుర్మార్గపు ఆలోచన చేస్తారని అనుకోలేదు. ఎప్పుడూ మా అమ్మానాన్నలను అత్తామామ అనేవాడు. మమ్మల్ని తీసుకెళ్లేముందు అమ్మానాన్నలతో మాట్లాడమని చెప్పాడు. కానీ నాన్న ఫోన్ ఎత్తలేదు. నా దృష్టిలో వాళ్లంతా చచ్చిపోయారు. నాకున్న అమ్మానాన్న.. హేమంత్ తల్లిదండ్రలే.. నా మరిది... నా సోదరుడు... అన్యాయంగా హేమంత్‌ను పొట్టనబెట్టుకున్నారు’’ అని కన్నీటి పర్యంతమయ్యారు అవంతి. 

Advertisement
Advertisement
Advertisement