Abn logo
Sep 27 2020 @ 13:05PM

పోలీసుల అదుపులో హేమంత్‌ హత్యకేసు నిందితులు

Kaakateeya

హైదరాబాద్ ‌: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన హేమంత్ హత్యకేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 మంది నిందితుల్లో మరో ఇద్దరు నిందితులు జగన్‌, సయ్యద్‌ పరారీలో ఉన్నారు. యుగేంధర్‌రెడ్డితో కలిసి హత్యకు కృష్ణ, బిక్షపతి, బాషా ఒప్పందం చేసుకున్నారు. హేమంత్‌ హత్య తర్వాత జగన్‌, సయ్యద్‌ నిందితులకు సహకరించారు. ప్రస్తుతం ఆ నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. రేపు సీపీ సజ్జనార్‌ను హేమంత్‌ కుటుంబసభ్యులు కలవనున్నారు.

ఇదిలా ఉంటే.. హేమంత్ భార్య అవంతి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘‘మా అమ్మానాన్నలను స్పాట్‌లోనే ఎన్‌కౌంటర్ చెయ్యండి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి.. ‘‘కేసీఆర్ సార్, జగన్ సార్ నాకు న్యాయం చేయండి. కేటీఆర్ సార్ నాకు న్యాయం చేయండి. మీరంతా నాతో ఉండాలి’ అని కోరారు.


Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement