Abn logo
Jun 4 2020 @ 03:20AM

ఆపన్నులకు సాయం

గుంటూరు, జూన్‌ 3: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు.  


పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి చేతుల మీదుగా వెజ్‌ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 


దళిత బహుజన రీసోర్స్‌ సెంటర్‌ (డీబీఆర్‌సీ) రాష్ట్ర కన్వీనర్‌ అల్లడి దేవకుమార్‌ ఆధ్వర్యంలో శివారు కాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  


గుంటూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి):  బీజేపీ, జనసేన కూటమి నాయకులు  బుధవారం  శ్రీనివాసరావుపేట మెయిన్‌రోడ్డులో పేదలకు బియ్యం, ఇతర సరుకులను పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు అమ్మిశెట్టి ఆంజనేయులు, అప్పిశెట్టి రంగా, జనసేన నాయకుడు ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement