Abn logo
Sep 22 2020 @ 01:07AM

కన్నీటిపాలు..ఉమ్మడిజిల్లాలో భారీ వర్షాలు

Kaakateeya

నీట మునిగిన పంటలు 30,502 ఎకరాలు 

రూ. 30.72 కోట్ల పంట నష్టం 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు


ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు  రైతన్నలు కుదేలయ్యారు. అష్టకష్టాలు పడి వరినాట్లు వేస్తే.. భారీ వర్షాలు, వరదలు పంటలను నిండా ముంచేశాయి. పత్తి చేలల్లో పెద్ద ఎత్తున నీరు చేరడంతో మొక్కలు ఎర్రబారి పిందెలు పాడయ్యాయి. వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తుండడంతో మొక్కజొన్న పంటలకూ నష్టం వాటిల్లింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురిశాయి.


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/ పరిగి, మొయినాబాద్‌ / మొయినాబాద్‌ రూరల్‌ / యాచారం / ఆమనగల్లు / కులకచర్ల : వారంరోజులుగా దంచికొట్టిన వానలకు ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో పంటలన్నీ నాశనమయ్యాయి. 30,502ఎకరాల విస్తీర్ణంలో పత్తి, వరి, కంది, పెసర, సోయాబీన్‌ పంటలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.30.72కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా.


వికారాబాద్‌ జిల్లాలో...

వికారాబాద్‌ జిల్లాలో ప్రధానంగా పత్తిపంటను సాగు చేశారు. గత ఏడాది లక్షన్నర ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి 2,30,192 ఎకరాలు సాగు చేశారు. కం దులు 1,75,900 ఎకరాలు, వరి 30 వేల ఎకరాలు, పెసర 20, 800, జొన్న 15వేలు, మొక్కజొన్న 20 వేలు, మినుములు 9,500 ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి జిల్లాలో 29,985 ఎక రాల్లో పంటలు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపించారు. వాస్తవానికి 50వేల ఎకరాల కంటే ఎక్కువగా పంటలకు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 15,477 ఎకరాల్లో పత్తి, 9,766 ఎకరాల్లో కందులు, 4747 ఎకరాల్లో వరి, పెసర, సోయాబీన్‌ తదితర పంటలకు నష్టం జరిగింది. అధికారుల నివేదికలు, క్షేత్రస్థాయిలో పంటల నష్టానికి భారీగా తేడా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. నష్టం జరిగిన విస్తీర్ణంలో కూడా 33 శాతమే పంట నష్టం జరిగిందని తేల్చారు. వాస్తవానికి 70శాతంపైగానే నష్టం జరిగిందని అంచనా.


జిల్లాలో తాండూరు, బషీరాబాద్‌, యాలాల్‌, పెద్దేముల్‌, మర్పల్లి, బంట్వారం, ధారూర్‌ మండలాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. అయితే పరిగి, పూడూరు, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల నష్టాలను గుర్తించలేకపోయారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కులకచర్ల మండల పరిధిలో పత్తి, జొన్న, కంది, పెసర పంటలు సాగు చేశారు. అల్లాపూర్‌ తం డాలో రాములునాయక్‌ సాగు చేసిన 5ఎకరాల పత్తి పంట కురిసిన  వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నది.జిల్లా వ్యవసాయ అధికారుల నివేదికల మేరకు జిల్లాలో దాదాపుగా రూ.30 కోట్ల విలువల చేసే పంటలకు నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే వాస్తవంగా రూ.60 కోట్ల విలువ చేసే పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పంటల నష్టాలను పరిశీలించి పరిహారాన్ని చెల్లించాలని రైతులు కోరుతున్నారు.


రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా ఈసారి సాగు అంచనా 3,99,561 ఎకరాలు కాగా 4,31,665 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఇందులో అత్యఽ దికంగా పత్తి 2,54,832 ఎకరాలు సాగు చేశారు. తర్వాత వరి పంట 66,131 ఎకరాలు, కంది 62,063 ఎకరాలు సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పత్తి, కంది పంటలు నీట మునిగాయి. ఆమగనల్లు, మహేశ్వరం, మంచాల, కేశంపేట, శంకర్‌పల్లి మండలాలోని 33 గ్రామాలు, 277 మంది రైతులకు చెందిన 419 ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, కంది పంటలు దెబ్బతిన్నాయి. సుమారు రూ. 62.85 లక్షలు నష్టం జరిగినట్లు అంచనా. దెబ్బతిన్న పంటల్లో అధికంగా వరి 99 ఎకరాలు, పత్తి 229 ఎకరాలు, కంది 88 ఎకరాలు, జొన్న మూడెకరాల్లో నీట మునిగి పాడైంది. అత్యధికంగా శంకర్‌పల్లి మండలంలోని 25 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి 60 ఎకరాలు, పత్తి 170 ఎకరాలు, కంది 88 ఎకరాల్లో నీటమునిగింది. యాచారం మండలం నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద, పిల్లిపల్లి గ్రామాల్లో వరి, పత్తి, కంది, జొన్న పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. నానక్‌నగర్‌లో 20ఎకరాలలో జొన్న, 30ఎకరాల్లో పత్తి, 38ఎకరాల్లో వరిపంటలు నీటమునిగాయి.


ఆమనగల్లు మండలపరిధిలోని పోలె పల్లి, సింగంపల్లి, శంకర్‌కొండ, జంగా రెడ్డిపల్లి గ్రామాల్లో 78ఎకరాల్లో 58మంది రైతులకు చెందిన పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పోలెపల్లిలో 25మంది రైతు లకు చెందిన 32ఎకరాల్లో పత్తి, 26 మంది రైతులకు చెందిన 25 ఎకరాల వరి, సింగం పల్లిలో ఒక రైతుకు చెందిన ఎకరా వరి, శంకర్‌ కొండలో ఇద్దరు రైతులకు చెందిన 3 ఎకరాల వరి, ఇద్దరు రైతులకు చెందిన 2ఎకరాల పత్తి, జంగారెడ్డిపల్లిలో ముగ్గురు రైతులకు చెందిన 4ఎకరాల పత్తి, ఒక రైతుకు చెందిన 2ఎకరాల వరి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథ మికంగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో సోమవారం మండల వ్యవసాయశాఖ అధికారి అరుణకుమారి, ఏఈఓ శివతేజ, సాయిరాం, మౌన్యరెడ్డి పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిం చారు. పోలెపల్లిలో నీట మునిగిన పంటలను ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ దోనాదుల సత్యనారాయణ, సర్పంచ్‌ బాల్‌రాం, ఉపసర్పంచ్‌ అంజన్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి పరిశీలించారు. పొలాల్లో ఉన్న వరద నీటిని జేసీబీ సహకారంతో బయటకు పంపించారు. 


నష్టపరిహారం అందించాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్‌, రజకసంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్య్యక్షుడు అరవింద్‌ రజకలు మొయినాబాద్‌ మండల వ్యవసాయ అధికారి రాఘమ్మకు గురువారం ఆమె కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని రెడ్డిపల్లి, చిలుకూరు, మేడిపల్లి, చిన్నమంగళారం, మోత్కుపల్లి, బాకారం, నాగిరెడ్డిగూడ, ఎన్కేపల్లి, అజీజ్‌నగర్‌, పెద్దమంగళారం గ్రామాల్లో పంటలు నీటమునిగినట్లు, ఎకరానికి రూ.10వేలు చెల్లించాలని  వారు ప్రభుత్వాన్ని కోరారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లాలో మేడ్చల్‌ జిల్లాలో 98 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీట మునిగింది. సుమారు రూ. 9.80 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా.


రైతులను ఆదుకోవాలి...

ఘట్‌కేసర్‌ రూరల్‌/ కీసర/ దోమ: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు దెబ్బతిని పూర్తిగా నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఘణాపూర్‌, అంకుశాపూర్‌, ఎదులాబాద్‌ తదితర గ్రామాల్లో నీటమునిగిన వరిపంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఘణపురం ఇన్‌చార్జి సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి బాసిత్‌, వార్డుసభ్యులు వేముల పరమే్‌షగౌడ్‌, పవన్‌ నాయక్‌, అఽధికారులు సురే్‌షరెడ్డి, జగదీష్‌ పాల్గొన్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని జాఫర్‌ఖాన్‌ చెరువు నిండి అలుగుపారి దిగువన ఉన్న వరిపంట నీట మునిగింది.


విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మాధవిలత సోమవారం పరిశీలించారు. అలుగు దిగువ భాగాన రాజుగౌడ్‌ అనే రైతు 4ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాడు. నీట మునిగిన పంట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని మాధవీలత తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆండాలు, మల్లే్‌షలతో పాటు పలువురు పాల్గొన్నారు. దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను సోమవారం ఏవో శ్వేతకుమారి, సర్పంచ్‌ అమృతమ్మాఆంజనేయులు పరిశీలించి వివరాలు సేకరించారు. రైతులు వెంకటయ్య, మొగులయ్య, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పంట పొలాలను సందర్శించి 50 ఎకరాల వరకు పంటల వివరాలు సేకరించినట్లు ఏవో తెలిపారు. 


జొన్న సాగుకు రూ.20 వేలు అప్పు చేశా...బుచ్చిరెడ్డి, రైతు మేడిపల్లి 

ఎనిమిది ఎకరాలలో జొన్నసాగు కోసం రూ. 20వేలు అప్పుచేశా.. తరచూ వర్షాలు కురుస్తుం డటంతో పంట నల్లగా మారింది. నల్లగా మార డంతో పశువులకు మేతగా కూడా పనికిరాకుండా పోయింది. ఒక్కోచోట కంకి పగిలిపోయింది. ఇక తనకు అప్పుల కుప్ప మిగిలింది.   


పిడుగు పాటుకు ఎద్దు మృతి

దోమ :  పిడుగు పాటుకు ఎద్దు మృతి చెందింది. దోమ మండల పరిదిలోని గుండాల్‌ గ్రామానికి చెందిన జె.హన్మిరెడ్డి పొలం దగ్గర తన పశువులను ఎప్పటిలాగే పాకలో శనివారం రాత్రి కట్టేసి ఇంటికొచ్చాడు. ఆదివారం రాత్రి వర్షంతో పాటు పిడుగు పడటంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఎద్దు విలువ దాదాపు రూ.50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.


చేపల కోసం యువకుల తంటాలు

యాచారం మండలంలోని తాడిపర్తి, నానక్‌నగర్‌ గ్రామాలలో చెరువులు నిండి అలుగు పారుతుండడంతో చేపలు పట్టడానికి యువకులు నానాతంటాలు పడు తున్నారు. తాడిపర్తి బందంచెరువు, నానక్‌నగర్‌ పెద్దచెరువులు అలుగుపారు తుండటంతో వరదనీటిలో చేపలు భారీగా వస్తున్నాయి. కొందరు యువకులు, గిరి జనులు వల వేసి చేపలను పట్టుకుంటున్నారు. రెండు రోజులుగా నానక్‌నగర్‌లోని కల్వర్టు వద్ద కొందరు వలతో చేపలు పట్టుకుంటున్నారు. కొంతమంది యువకులు జొన్న, వరి చేలలోకి వచ్చిన చేపలను కర్రలతో కొట్టి పట్టుకుంటున్నారు.         

Advertisement
Advertisement
Advertisement