Abn logo
Sep 27 2021 @ 00:29AM

భారీ వర్షం

జలమయమైన ఫార్మాసిటీ ప్రధాన రహదారి

లోతట్టు ప్రాంతాలు జలమయం

పరవాడ, సెప్టెంబరు 26: గులాబ్‌ తుఫాన్‌ కారణంగా పరవాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా పరవాడ నుంచి ఫార్మాసిటీకి వెళ్లే ప్రధాన రహదారిలోని తిరుపతి ఫ్యూయల్స్‌ కంపెనీ సమీపంలో నీరు నిల్వ వుండిపోవడంతో రహదారి చెరువును తలపించింది. భారీ వర్షం కురవడంతో పరవాడ ఊర చెరువు నీటితో కళకళలాడుతోంది. కాగా మండల పరిషత్‌ ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది. కూరగాయ పంటలకు వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే మండల వ్యాప్తంగా ప్రధాన సాగునీటి చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ముత్యాలమ్మపాలెం తీరం అల్లకల్లోలంగా ఉంది. పెద్ద ఎత్తున కెరటాలు ఎగసి పడుతున్నాయి. దీంతో మత్స్యకారులంతా వేటకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉండిపోయారు.