Abn logo
May 23 2020 @ 21:02PM

అసోంలో ఎడతెగని వర్షం.. ఉప్పొంగుతున్న బ్రహ్మపుత్ర

దిస్‌పూర్: ఆంఫన్ తుఫాను కారణంగా అసోంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ వెల్లడించింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నీటమునుగుతున్నాయని, వరదనీరంతా నదిలో చేరుతుండడంతో ఉధృతి మరింత ఎక్కువవుతోందని తెలిపింది. మే 16వ తేదీ నుంచి నదిలోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని, ప్రతి రెండు, మూడు నిమిషాలకు నదిలోని నీటిమట్టం 1, 2 సెంటీ మీటర్లు పెరుగుతున్నదని కమిషన్ వివరించింది. నది ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement