Abn logo
Sep 30 2020 @ 03:29AM

లాక్‌డౌన్‌లో 30శాతం పెరిగిన గుండెపోట్లు

బెంగళూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమే స్తంభించింది. ప్రజల జీవనశైలి మారింది. లౌక్‌డౌన్‌లో గుండెపోటుకు గురైన వారి సంఖ్య 30 శాతం పెరిగిందని బెంగళూరుకు చెందిన హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. కరోనా భయం వెంటాడటం, ప్రజల జీవనశైలిలో మార్పులు దీనికి ప్రధాన కారణమై ఉంటుందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ శ్రీకంఠ శెట్టి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో సమస్యలు చుట్టుముట్టడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం వంటివి కూడా కారణమని మరో వైద్యనిపుణుడు కేపీ శ్రీహరిదాస్‌ అభిప్రాయపడ్డారు.


Advertisement
Advertisement
Advertisement