Abn logo
Aug 7 2020 @ 04:01AM

ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు ప్లీజ్‌

  • చికిత్సకు ఇతర రాష్ట్రాలకెళ్లొద్దు
  • ఇక్కడా ఏ మాత్రం తీసిపోని వైద్యం 
  • వైద్యం, సదుపాయాలు కల్పిస్తాం
  • వీఐపీలకు మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి 

తిరుపతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కరోనా బాధితుల చికిత్సలకు నెలకు రూ.350కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడున్న మెడికల్‌ సర్వీసులు, ఇతర రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోవు. దయ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లవద్దని విన్నవిస్తున్నాం. ప్రైవసీ కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుంటే.. అలాంటి పరిస్థితే ఇక్కడా కల్పిస్తాం. కొవిడ్‌ వారియర్స్‌, మంత్రులు, ఐఏఎ్‌సలను వీఐపీల్లాగా చూస్తున్నాం. అలాగే  చికిత్సలు అందిస్తాం’ అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కొవిడ్‌ బాధితులకు అరగంటలో బెడ్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల కొవిడ్‌ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. వైద్యులకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం నుంచి నుంచి బలవర్థకమైన ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మృతుల నగలు, సెల్‌ఫోన్లు చోరీ చేసిన నిందితులను 2-3 రోజుల్లో పట్టుకుంటామని ఎస్పీ చెప్పారని, సీసీ ఫుటేజీ చూసి దోషులను పట్టుకుంటారన్నారు. రోగుల యోగక్షేమాలపై బంధువులకు సమాచారమిచ్చేలా కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.


Advertisement
Advertisement
Advertisement