Abn logo
May 26 2020 @ 03:16AM

చాన్సిస్తే..మళ్లీ వచ్చేస్తా!

ఐపీఎల్‌లో రాణిస్తున్నా కదా..:  హర్భజన్‌

న్యూఢిల్లీ: జాతీయ టీ20 జట్టుకు ఆడేందుకు తాను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు పోటీపడే ఐపీఎల్‌లో నాలుగేళ్లుగా రాణిస్తున్నప్పటికీ.. జాతీయ జట్టులోకి మాత్రం తనను ఎంపిక చేయడం లేదని సెలెక్టర్లపై భజ్జీ విమర్శనాస్ర్తాలు సంధించాడు. ‘ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. అలాంటి టోర్నీలో బాగా ఆడగలుగుతున్నప్పుడు.. జాతీయ జట్టులో ఎందుకు రాణించలేను? నాకు వయసైపోయిందని సెలెక్టర్లు నా మొహం చూడడం లేదు. అవకాశమిస్తే.. టీ20 జట్టులో నా సత్తా ఏంటో చూపిస్తా’ అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 39 ఏళ్ల భజ్జీ ధీమా వ్యక్తం చేశాడు. హర్భజన్‌ చివరిసారిగా 2016 ఆసియా కప్‌లో ఆడాడు. 

Advertisement
Advertisement
Advertisement