Abn logo
Sep 22 2020 @ 00:00AM

రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది: ఆల

అడ్డాకుల, సెప్టెంబరు 22: నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసిన చెరువులు, కుంటలు నిండడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పొన్నకల్‌లో 30 ఏళ్ల తర్వాత నిండిన నల్ల, ఓవల్‌, పెద్ద చెరువుల అలుగుల వద్ద జల పూజ నిర్వహించారు. అంతకు ముందు జాతీయ రహదారి నుంచి చెరువుల వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, వనపర్తి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, మదనాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బాల్‌నారాయణ, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


రైతుల మంచికే రెవెన్యూ చట్టం: రైతులకు ఎదురైన ఇబ్బందులను తొలగించడానికి కేసీఆర్‌ చారిత్రాత్మక రెవెన్యూ చట్టాన్ని తెచ్చారని ఎమ్మెల్యే ఆల అన్నారు. మండల పరిధిలోని పొన్నకల్‌లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ చట్టంపై త్వరలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ప్రతి గ్రామం నుంచి రైతులు ట్రాక్టర్లపై తరలొచ్చి నిర్ధేశించిన స్థలంలో సంబురాలు చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాధిక, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, వనపర్తి జడ్పీవైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, మదనాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌నారాయణ, మహిముద్‌, రాజేశ్వర్‌రెడ్డి, రంగన్నగౌడ్‌, ఖాజాఘోరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement