Advertisement

ఈ హీరోని టాలీవుడ్ యష్ అంటున్నారట

ఈ హీరోని టాలీవుడ్ యష్ అంటున్నారట. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? ఇటీవల ‘రామ్ అసుర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభినవ్ సర్దార్. ఆ చిత్రంలో సూరి పాత్రలో ఆయనని చూసిన వారంతా టాలీవుడ్ యష్ అని సంభోదిస్తున్నారట. ఈ చిత్రంలో అభినవ్ సర్దార్ ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా, సెకండాఫ్‌లో అసురుడిగా కనిపించారు. చిత్రంలోని లుక్, యాక్టింగ్ చూసిన వారంతా టాలీవుడ్ యష్‌ అని పిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని తన తాజా ఇంటర్వ్యూలో అభినవ్ తెలిపారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రామ్ అసుర్‌ సినిమాతో నటుడిగా, నిర్మాతగా మంచి సక్సెస్‌ని అందుకున్నాను. కెరీర్‌లో ఇంకా చాలా సాధించేది ఉంది. అను నిత్యం నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉంటాను. ఈ చిత్రంలో నేను పోషించిన రెండు డిఫరెంట్ షేడ్స్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకొని నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించాయి. ముఖ్యంగా అందరూ టాలీవుడ్ యష్ అంటుంటే.. చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని డిఫరెంట్ కథలతో ప్రేక్షకలోకాన్ని అలరిస్తాను. ప్రస్తుతం ఇతర భాషలలో కొన్ని బిగ్ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. త్వరలో వాటి వివరాలను తెలియజేస్తాను..'' అన్నారు. కాగా, దాదాపు పదేళ్ల క్రింద తన సినీ ప్రయాణాన్ని ఆరంభించిన అభినవ్ సర్దార్.. తన సంపాదనలో 10 శాతం మేర దాతృత్వ పనుల కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలియజేశారు.

Advertisement