Abn logo
Nov 1 2020 @ 02:28AM

హన్సిక 50వ మైలురాయి

Kaakateeya

తన సినీకెరీర్‌లో 50వ మైలురాయిని అధిగమించారు నటి హన్సిక మోత్వానీ. తన 50వ చిత్రంగా తమిళంలో తెరకెక్కుతోన్న ‘మహా’ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని హన్సిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు.  ‘‘ఇదొక గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. క్లిష్ట పరిస్థితుల్లోనూ ‘మహా’ షూటింగ్‌ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. షూటింగ్‌ సజావుగా సాగేలా సహకరించిన సిబ్బందికి ధన్యవాదాలు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన శింబుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు. ఇంతకు ముందు విడుదల చేసిన పోస్టర్లలో పలు రకాల గెటప్పుల్లో కనిపించిన హన్సిక ‘మహా’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. యు.ఆర్‌. జమీల్‌ దర్శకత్వంలో మతియాలగన్‌, అబ్దుల్‌ మాలిక్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement