Abn logo
Sep 30 2020 @ 05:17AM

ఆయ‘కట్‌’ ఎందుకు.?

Kaakateeya

60 టీఎంసీల నీరు వస్తున్నా పూర్తి స్థాయిలో ఇవ్వలేరా?

ఐఏబీలో గళమెత్తిన ఎమ్మెల్యే అనంత

రెండు గంటలు ఆలస్యంగా సమావేశం ప్రారంభం 

నీటి కేటాయింపులు.. విడుదలపై రాని స్పష్టత

అధికారులపై ఎమ్మెల్యే ధ్వజం

తాగునీటి కొరత లేకుండా చూస్తాం : మంత్రి


అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 29 :  హంద్రీనీవా, హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు సుమారు 60 టీఎంసీల వరకు నీరు వస్తున్నా ఆయకట్టుకు ఎందుకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వడం లేదని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధికారులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా, హెచ్చెల్సీ సమాంతర కాలువలు, విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఐఏబీలో చేసిన తీర్మానాలను ఇక్కడే వదిలేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను పరిశీలించాలన్నారు.


వరి నాటవద్దన్నారు సరే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యతను మరిచిపోతున్నారని పేర్కొన్నారు.  సమావేశం షెడ్యూల్‌ కంటే రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రతి ఎమ్మెల్యే  వారి నియోజకవర్గాలపై చర్చించి సమావేశం జరు గుతుండగానే వెళ్లిపోయారు. మూడు గంటల పాటు సమావేశం సాగినా...స్పష్టమైన అంశాలను చర్చించకపోవడం గమనార్హం. కర్నూలు, కడప జిల్లాలకు నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. రాష్ట్ర భవనాలు, రహదారుల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి అన్ని చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ద్వారా వచ్చే నీటితో మొదట చెరువులను నింపే ప్రక్రియను చేపడతామన్నారు.


అన్ని ప్రాం తాలకు సమానంగా నీటి హక్కులను కల్పించి స మంగా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూస్తామన్నా రు. గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్‌లను నింపి మడకశిరతో పాటు పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలకు నీరు ఇచ్చి, పేరూరు డ్యాంకు తరలిస్తామన్నారు. ఐఏబీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ జి ల్లాలో వరి పంట సాగు చేయకుండా, ఆరుతడి పంటలపై రైతులు శ్రద్ధ పెట్టాలన్నారు. హంద్రీనీవా కాలువ వెడ ల్పు, ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రాం తాలలో భూసేకరణ పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.  దామాషా ప్రకారం నీటి కేటాయింపులు జరుగుతాయన్నారు. హంద్రీనీవా ఫేజ్‌-1 డిస్ట్రిబ్యూటరీలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.


ప్రభుత్వవిప్‌ కాపురామచంద్రారెడ్డి మాట్లాడుతూ దామా షా ప్రకారం నీటి లభ్యత ఆధారంగా అన్ని ప్రాంతాలకు సమానం గా నీటిని పంపిణీ చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య స మన్వయం ఉంటేనే అధికంగా నీటిని తీసుకువచ్చేందుకు అవకాశం ఉం దన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని 48 చెరువులను నీటితో నిం పాలని, ఉంతకల్లు రిజర్వాయర్‌ నిర్మాణం వెంటనే చేపట్టాలని సూచించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మాట్లాడుతూ పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీటిని కేటాయించినట్టు అజెండాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. చెరువులను నింపిన తరువాతే ముందుకు వెళ్లాలన్నారు.  హె చ్చెల్సీ ఆధునికీకరణ, కాలువ వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీఏబీఆర్‌ నీటి నిల్వ సామర్థ్యం పెంచడంపై దృష్టి పెట్టాల ని, కుడికాలువ కింద డిస్ట్రిబ్యూటరీలు నిర్మించాలన్నారు.


ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ చెరువులలో పూడికతీత, ముళ్లకంపలు తొలగింపు పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్య క్తం చేశారు. కర్నూలు జిల్లాలో హంద్రీనీవా నీటిని అధికంగా వాడుకుంటున్నారని, దాన్ని నియంత్రించాలని సూచించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం డ్యాం నుంచి వందలాది టీఎంసీల నీరు వృథాగా పోతోందని ఆ నీటిని జిల్లాకు తరలించేలా చూడాలన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. బుక్కప ట్నం చెరువు కింద ఉన్న జానకంపల్లి గ్రామం ముంపు కింద పరిహారం ఇవ్వాలని, పంటల సాగుకు స హకరించాలన్నారు. గ్రామాలలో తాగునీటి సరఫరాకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీరు వెళ్తున్నాయని... ఎవరు ఏమనుకున్నా కాలవలకు గండి కొట్టైనా రైతులకు సాగు నీరు తీసుకుంటామని స్పష్టం చేశారు. నక్కలదొడ్డి, పామిడి సమీపంలో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించాలని గతంలోనే అనేక సార్లు ప్రతిపాదనలు పంపామని అయితే ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌ మాట్లాడుతూ జీడిపల్లి నుంచి బీటీపీకి నీటిని తీసుకెళ్లే కాలువ భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. కళ్యాణదుర్గంలో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో అన్ని చెరువులను నీటితో నింపాలన్నారు. కదిరి ఎమ్మె ల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ కింద ఉన్న చెరువులకు నీరివ్వాలన్నారు.


పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు ఇస్తే...భూగర్భజలాలు పెరిగి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ శింగనమల చెరువును లోకలైజేషన్‌ చేస్తే 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందడంతో పాటు అక్కడ ఉన్న 600 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నా రు.  నియోజకవర్గానికి 10టీఎంసీల నీరివ్వాలన్నారు.  ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మాట్లాడుతూ హిందూపురంలో తాగునీటి కొరత ఉందని, దాన్ని పరిష్కరించేందుకు హంద్రీనీవా నీటిని  తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని చెరువులను హంద్రీనీవా, హెచ్చెల్సీ నీటితో నింపాలన్నారు.


సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, జేసీ నిశాంత్‌కుమార్‌, జలవనరుల శాఖ సీఈ నాగరాజు, ఐఏబీ కన్వీనర్‌, హెచ్చెల్సీ ఇంజనీర్‌ రాజశేఖర్‌, హంద్రీనీవా ఎస్‌ఈ వెంకటరమణ, మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌, ఈఈలు, డీఈలు, వివిధ శా ఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా.. ఈ సమావేశం అధికారులపై ప్రజాప్రతినిధులు రుబాబు చేయడానికి వేదిక అయిందని. సమస్యలకు అధికారులను నిందించే ప్రజాప్రతినిధులు నిధుల కొరతపై మాత్రం నోరు మెదపలేదని చర్చించుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement