Abn logo
Jan 18 2021 @ 00:08AM

అలవోకగా అల్లికలు !

నేటితో ముగియనున్న చేనేత పోటీలు

హాజరైన 150 మంది నేతన్నలు


చీరాల, జనవరి 17 : చేనేత వస్త్ర తయారీ సృజనాత్మ కతకు మారుపేరు. మగ్గంపై ధారాల కూర్పులో నేతన్నల చేతులు అలవోకగా కదులుతుంటాయి. ఆ ప్రక్రియ చూసే వారికి అత్యంత కష్టం.. ఆశ్చర్యకరం.. వారికి మాత్రం అతి సాధారణం. వేగం, నాణ్యత, తయారీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గత మూడు రోజులుగా చీరాల మం డలం హస్తినాపురంలో మగ్గంపై వస్త్ర అమరిక పేరుతో పో టీలు నిర్వహిస్తున్నారు. నేతన్నలలో దాగిఉన్న మెళకు వలను వెలికితీసేందుకు అప్పుడప్పుడూ అటు ప్రభుత్వ ప రంగాను, ఇటు పలు సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి స్థానిక హస్తినాపురంలో సొసైటీ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ అండ్‌ హ్యాండీక్రాప్ట్స్‌, వార్స్‌ అండ్‌ వెస్ట్‌వీవ్స్‌, రాష్ట్ర చేనేత జన సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో మగ్గంపై వస్త్ర అమరిక పేరుతో పోటీలు నిర్వహిస్తున్నారు. చీరాల ని యోజకవర్గం పరిధిలో ఈపురుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న నేతన్నల్లో సుమారు 150 మంది పాల్గొన్నారు.


పోటాపోటీగా మగ్గంపై వస్త్ర అమరికలు


ప్రతి చేనేత కార్మికుడు మగ్గంపై పని చేస్తాడు. అం దులో నైపుణ్యం, వేగం, నాణ్యతను ప్రామాణికంగా ఈ పో టీలను నిర్వహిస్తున్నారు. మగ్గంపై నేత నేసే కార్మికుడు ప రిస్థితికి అనుగుణంగా 2 నుంచి 5 గంటల సమయం ఇ చ్చారు. ఏడు మగ్గాలపై పోటీ జరుగుతుండగా జాకార్డు మ గ్గంలో కొన్ని ప్రత్యేకతలను జోడించారు. ఆ మగ్గం వరకు 5 గంటల సమయం కేటాయించారు. పోటాపోటీగా వస్త్ర అ మరిక జరుగుతుండటంతో చూపరులకు ప్రతి మగ్గంపై జ రిగే ప్రక్రియ అద్భుతంగానే కన్పించింది. ఈ పోటీలు సో మవారంతో ముగియనున్నాయి. పోటీలలో గెలుపొందిన వి జేతలకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి బహుమతు లు అందజేస్తారు.  


పోటీల నిర్వహణ అభినందనీయం


సంక్రాంతి పర్వదినాన ఈ పో టీలు నిర్వహించడం ఆనందంగా ఉంది. వీటిని పాల్గొనేవారికి, చూ సేవారికి ఉపయోగపడేవిధంగా  రూపొందించారు. నిర్వాహకులు క్రమశిక్షణతో పోటీలు నిర్వహించ డం అభినందనీయం.

- గోరంట్ల సుధాకిరణ్‌, క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి, చీరాల


Advertisement
Advertisement
Advertisement