Abn logo
Mar 26 2020 @ 03:51AM

హజ్‌ యాత్ర రద్దుపై నిర్ణయం తీసుకోలేదు: కమిటీ

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మరో రెండు నెలల తర్వాత ప్రారంభం కానున్న హజ్‌ యాత్ర రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ హజ్‌ కమిటీ అధ్యక్షుడు మసీవుల్లా ఖాన్‌ తెలిపారు. దీనిపై సోషల్‌ మీడియాలో పుకార్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం హజ్‌ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన హెచ్చరించారు. హజ్‌ యాత్రకు ఎంపికైన వారు రెండో విడత కిస్తు ఈనెల 31 లోపు చెల్లించాలని కోరారు. యాత్రకు ఇంకా సమయం ఉందని, అప్పటివరకు పరిస్థితులు అనుకూలంగా లేక యాత్ర రద్దైన పక్షంలో డబ్బులు వాపస్‌ చేస్తామని వెల్లడించారు.


Advertisement
Advertisement
Advertisement