Advertisement
Advertisement
Abn logo
Advertisement

చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(12-01-2021)

చలికాలంలో శిరోజాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వేడి నీళ్ల స్నానం వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. జుట్టు చివర్లు పగులుతాయి. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అయితే ఈ జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా శిరోజ సౌందర్యం కాపాడుకోవచ్చు. ఏంచేయాలంటే...


ఒక బౌల్‌లో ఒక టీస్పూన్‌ షాంపూ తీసుకుని అందులో కొద్దిగా ఆముదం, గ్లిసరిన్‌, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిగా ఉన్న జుట్టుకు పట్టించాలి. పావుగంట తరువాత షాంపూతో కడిగేసుకోవాలి. ఒక అరటిపండు, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ఆయిల్‌, ఒక టీస్పూన్‌ అలొవెరా జెల్‌... ఈ మూడింటిని కలిపి పేస్టులా చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది. 


ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి రెండు రోజుల పాటు నానబెట్టాలి. ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లను ఫ్రిజ్‌లో పెట్టుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. రెండు స్పూన్ల మెంతులను రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ మెంతులను పేస్టులా పట్టుకుని, కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట తరువాత కుంకుడుకాయలతో శుభ్రం చేసుకోవాలి. కుంకుడుకాయలు లేకపోతే హెర్బల్‌ షాంపూ ఉపయోగించవచ్చు. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. కొబ్బరిపాలలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. నాలుగైదు గంటల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

Advertisement
Advertisement