Abn logo
May 31 2021 @ 14:09PM

జుట్టు రాలడం ఆగాలంటే..!

జుట్టు రాలుతోంది అనగానే ఆందోళన మొదలవుతుంది. తెలిసిన షాంపూలు, ఇతర ప్రయత్నాలు అన్నీ  చేస్తారు. అలాకాకుండా ముందుగా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 


ఇతర సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే ఆ మందుల వల్ల జుట్టు రాలుతూ ఉండవచ్చు. ఒత్తిడి కూడా ఒక కారణమే. జన్యుపరంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ముందుగా కారణం తెలుసుకోవాలి.

పోషకాహారం లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి పండ్లు, చేపలు, కోడిగుడ్లు అధికంగా తీసుకోవాలి. నట్స్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

కొంతమంది కాస్త తెల్లజుట్టు కనిపించగానే రంగు వేస్తుంటారు. కానీ రంగు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు.

క్యారట్‌ ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. ప్రోటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.