Abn logo
Feb 25 2021 @ 22:17PM

జీవీ ప్రకాష్‌ హీరోగా మరో చిత్రం.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

కోలీవుడ్‌: కోలీవుడ్‌ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ హీరోగా బిజీ అయిపోతున్నారు. ఒకవైపు పలు చిత్రాలకు సంగీత బాణీలను సమకూరుస్తూనే మరోవైపు తనకు వచ్చిన హీరో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ కోవలోనే పలు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ‘వణక్కండా మాప్ల’ అనే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ‘శివ మనసుల శక్తి’, ’ఒరు కల్‌ ఒరు కణ్ణాడి’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం.రాజేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జీవీ ప్రకాష్‌ హీరోగా నటిస్తూనే సంగీతం కూడా సమకూరుస్తున్నారు. ఈయన సరసన అమృతను హీరోయిన్‌గా ఎంపికచేశారు. అలాగే, ‘బిగ్‌ బాస్‌’ ఫేం డేనియల్‌, రేష్మా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తి హాస్యభరితంగా తయారయ్యే ఈ చిత్రం నేరుగా థియేటర్లలో కాకుండా, బుల్లితెరపై విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.

Advertisement
Advertisement
Advertisement