Abn logo
Mar 20 2021 @ 18:52PM

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

సిద్దిపేట: అనుమతి లేకుండా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలంలో తనకున్న కిరాణాదుకాణంలో పుల్లూరి నర్సయ్య అనే వ్యక్తి గుట్కా పాకెట్లు రహస్యంగా అమ్ముతున్నాడు. గుట్కా పాకెట్లు అమ్ముతున్నారనే విశ్వసనీయమైన సమాచారంతో కిరాణా దుకాణంపై పోలీసులు దాడి చేశారు. దాదాపు లక్ష రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...