Abn logo
Jun 18 2021 @ 23:27PM

రూ. 22 లక్షల విలువైన గుట్కా నిల్వల పట్టివేత

జంగారెడ్డిగూడెం, జూన్‌ 18: జంగారెడ్డిగూడెం జాతీయ రహదా రిని ఆనుకుని ఉన్న ఒక గోదాము లో రూ. 22 లక్షల విలువైన 5,66,530 ప్యాకెట్ల నిషేధిత గుట్కా ను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఇటీవల కాలంలో పోలీసు లు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి దుకాణాల్లో అమ్మే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే శుక్రవారం జరిపిన దాడిలో భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దూబగుంట్ల పూర్ణచంద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ ఆనందరెడ్డి తెలిపారు.