Abn logo
Sep 21 2021 @ 23:38PM

ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

తేతలి హైస్కూల్‌లో గురజాడకు నివాళులు

తణుకు, సెప్టెంబరు 21:ప్రముఖ రచయిత, అభ్యు దయ కవి గురజాడ వెంకట అప్పారావు గేయాలు స్ఫూర్తిదాయకమని తేతలి హైస్కూల్‌ హెచ్‌ఎం ఏడుకొండలు అన్నారు. అప్పారావు జయంతి సందర్భంగా మంగళవారం చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలు గు ఉపాధ్యాయుడు బుచ్చియ్య మాట్లాడుతూ వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ పాత్రను వివరించారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు గురజా డ ప్రచురించిన కరపత్రాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయులు ఎన్‌.రమేష్‌, రాజకు మారి, అనురాధ, బీఎం. గోపాలరెడ్డి పాల్గొన్నారు.

భీమడోలు : మహాకవి గురజాడ నిత్యస్ఫూర్తి ప్రదాత అని సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఆర్‌.లింగరాజు అన్నారు. భీమడోలు జిల్లా పరిషత్‌ హైస్కూలు, మానస పబ్లిక్‌ స్కూళ్ళల్లో గురజాడ జయంతి వేడుకలు మంగళవారం నిర్వ హించారు. గురజాడ జీవిత చరిత్రను వివరించిన పలువురు విద్యార్థినులకు ప్రిన్సిపాల్‌ రవీంద్ర బహుమతులు అందజేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాదరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గణపవరం : కలం యోధుడు గురజాడ అప్పారావు అని సాహితివేత్త, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ కాళ్లకూరి సత్యనారాయణమూర్తి అన్నారు. గణపవరం చాణుక్య జూనియర్‌ కళాశాలలో గురజాడ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలుగులో ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నీ గురజాడ తీర్చి దిద్దినవేనన్నారు. తొలుత గురజాడ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో తెలుగు భాషాభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ అడబాల శ్రీనివాసరావు, లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ చైర్మన్‌ వెల్లంకి న రేష్‌, జిల్లా చైర్మన్‌ కిలారి రవిబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.