Abn logo
Jul 12 2020 @ 09:16AM

గుంటూరు: వైసీపీ గ్రూప్‌లో అసభ్యకర పోస్టులు...కేసు నమోదు

గుంటూరు: వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో  అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న కాటూరి గూడారయ్య అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపట్నం మండలం  అడవులదీ గ్రామానికి చెందిన కాటూరి గుడారయ్య... ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా, ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే అడువులదీవి వైసీపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో వైసీపీ గ్రూప్‌లో గుడారయ్య అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రూప్ అడ్మిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అడువులదీవి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో విద్యార్థినుల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కాటూరి గుడారయ్యపై ఆరోపణలు ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement