Abn logo
Aug 8 2020 @ 21:10PM

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 1,101 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 69,986 కోవిడ్ పాజిటివ్ నమోదయ్యాయి. ప్రస్తుతం 14,530 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా వల్ల ఇవాళ 23 మంది మృతి చెందగా, మొత్తం 14,530 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని 52,827 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


Advertisement
Advertisement
Advertisement