Abn logo
Apr 4 2020 @ 21:49PM

కరోనా ఎఫెక్ట్: చెక్కులను ఇస్త్రీ చేస్తున్న బ్యాంకు అధికారి

వడోదర: కరోనా పుణ్యమా అన్ని ఎన్నడూ చూడని, కనీసం ఊహకు కూడా అందని దృశ్యాలన్నీ మనముందు సాక్ష్యాత్కారమవుతున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ బ్యాంక్ అధికారి..తనకు కరోనా సోకకూడదని ఏకంగా చెక్కులను ఇస్త్రీలు చేసేస్తూ కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ట్విటర్‌లో షేర్ చేశారు. సదరు అధికారి.. కస్టమర్ తెచ్చిన చెక్కును పట్టకారాతో అందుకున్నారు. ఆ తరువాత దాన్ని టేబుల్‌పై ఉంచి ఇస్త్రీ చేశారు. చేతులకు గౌవ్స్ ధరించి ఆయన ఇవ్వన్నీ చేశారు. కాగా.. ఈ వీడియోపై స్పందించిన ఆనంద్ మహింద్రా..బ్యాంకు అధికారి సృజనాత్మకతను మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. 


Advertisement
Advertisement