Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతడి విన్యాసం చూసి ‘గిన్నిస్’ అధికారులే ఖంగుతిన్నారు.. పేరు నమోదు చేయలేమంటూ చేతులెత్తేశారు..

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కోసం ఎంతో మంది రకారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టేందుకు పోటీపడుతుంటారు. కొందరు చేసే స్టంట్‌లు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కనీసం అలాంటి విన్యాసాలు చూడటానికి కూడా భయమేస్తుంది. కానీ ఓ వ్యక్తి చేసిన స్టంట్స్ చూసి.. ఏకంగా గిన్నిస్ బుక్ అధికారులే భయపడ్డారు. అతడి పేరు నమోదు చేయమంటూ చేతులెత్తేశారు.

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ.. అత్యంత అరుదైన స్టంట్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. చేతులతో ముట్టుకోకుండా.. కేవలం నోటితోనే పట్టుకున్నాడట. 2010లో కూడా ఇలాంటి విన్యాసం చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. మళ్లీ దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు. అయితే గిన్నిస్‌ బుక్‌ అధికారులు.. అతడి విన్యాసం చూసి షాక్ అయ్యారు. పేరు నమోదు చేసేందుకు నిరాకరించారు. అతడి విన్యాసానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ.. ఈ విషయం తెలియజేశారు.


నీపై నాకు విరక్తి పుట్టిందంటూ చెప్పిన భార్య.. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement