Abn logo
Jul 11 2020 @ 06:14AM

మరో 92

శుక్రవారం జిల్లాలో నమోదైన కేసులు

600కు చేరుకున్న బాధితుల సంఖ్య

పెరుగుతున్న కంటైన్మెంట్లు

నిర్థారణ పరీక్షలు ముమ్మరం


రింగురోడ్డు, జూలై 10 : జిల్లాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 92 మందిలో వైరస్‌ లక్షణాలు బయటపడినట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్‌ ప్రకటించారు.  దీంతో బాధితుల సంఖ్య 600కు చేరుకుంది. ప్రాథమిక నిర్థారణ పరీక్షల్లో వైరస్‌ లక్షణాలు బయట పడుతుండడంతో స్వాబ్‌ తీసి ల్యాబ్‌కు పంపుతున్నారు. పాజిటివ్‌ అని తేలితే కొవిడ్‌ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది వలసకూలీలు జిల్లాకు వచ్చారు. వారందరినీ పునరావాస కేంద్రాల్లో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక నిర్థారణ పరీక్షలు చేస్తుండగా వందలాది మందిలో వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారందరినీ కొవిడ్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు. ఇంకా వేలాది మందికి సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది.


ఇప్పటి వరకూ 248 మంది కోలుకోవడంతో జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా భారీగా కేసులు వెలుగుచూస్తున్న దృష్ట్యా కంటైన్మెంట్‌ జోన్లు పెరుగుతూ వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 105 కంటైన్మెంట్‌ జోన్లు ప్రకటించిన అధికారులు రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వైరస్‌ నిర్థారణ పరీక్షలు, ఇంటింటా ఫీవర్‌ సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటివరకూ 50237 మందికి నిర్థారణ పరీక్షలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement