Abn logo
Jul 11 2020 @ 05:09AM

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం

జడ్చర్ల, జూలై 10: భవిష్యత్తు తరాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత హారం కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం శివగిరి క్షేత్రం పరిసర ప్రాంతంలో శుక్రవారం డ్రోన్‌తో సీడ్‌బాల్స్‌ను కలెక్టర్‌ వెంక్రటావుతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతిమొక్కను బతికించుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం బాదేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రూ.28లక్షలు, మరో రూ.69లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదుల నిర్మాణం పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు పిట్టల మురళి, ఎంఈఓ మంజులాదేవి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement