Advertisement
Advertisement
Abn logo
Advertisement

గురజాడకు ఘన నివాళులు

 ఎస్‌.రాయవరంలో విగ్రహానికి పూలమాలలు వేసిన ఎంపీపీ దంపతులు 


ఎస్‌.రాయవరం, నవంబరు 30: ప్రముఖ సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎస్‌.రాయవరంలో ఆయన విగ్రహానికి ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, గోవిందరావు దంపతులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గురజాడ వంటి మహాపురుషుడు జన్మించిన ఎస్‌.రాయవరంలో తాము ఉండడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. గురజాడ కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ లక్కోజు ఆదిమూర్తి, సర్పంచ్‌ భూపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement