అంతర్వేదిలో పండిత సదస్యం నిర్వహిస్తున్న అర్చకస్వాములు
- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘట్టం
- ప్రత్యేక సింహాసనంపై స్వామి, అమ్మవారు
అంతర్వేది, ఫిబ్రవరి 25: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం ఆలయ పురాతన కల్యాణ మండపం వద్ద నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై అలంకరించి పండిత సదస్యం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్, స్థానాచార్యులు వింజమూరి రంగాచార్యులు, వేదపండితులు చింతా వెంకటశాసి్త్ర, అర్చకస్వాములు సారథ్యంలో ప్రత్యేక మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్లకు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి కల్యాణం, రథోత్సవం ముగించుకున్న అనంతరం స్వామి, అమ్మవార్ల ఆశీర్వచనం పొందే ఈ ఘట్టం భక్తులను పులకింపజేసింది. ఈ పండితసదస్యంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, వలవల రాంబాబు పాల్గొన్నారు.