Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామాల అభివృద్ధికి విస్తృత సేవలు

ఉయ్యూరు, నవంబరు 30 : ఉయ్యూరు, పరిసర గ్రామాల అభివృద్ధికి   విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేపట్టనున్నట్టు తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌ అన్నారు. ఉపాధ్యక్షుడు పుట్టగుంట సురే్‌షతో కలిసి మంగళవారం స్థానిక సంస్థల నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను ఉయ్యూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తానా సంస్థ ద్వారా గ్రామాల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.  వైవీబీ మాట్లాడుతూ తానా  అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నియమితులైన నిరంజన్‌, సురేష్‌  ఉయ్యూరు పరిసర గ్రామాలకు చెందిన వారుకావటం గర్వకారణమన్నారు. తానా సంస్థ ద్వారా గ్రామాలకు సేవలందిస్తామని చెప్పడం సంతోషమని, తెలుగువారి ఆత్మగౌర వాన్ని తానా ద్వారా అమెరికాలోనూ చాటాలన్నారు. ఈ సందర్భంగా ఇరువురిని దుశ్శాలువాతో రాజేంద్రప్రసాద్‌ ఘనంగా సత్కరించారు.  బీసీ జిల్లా నాయకుడు జంపన వీరశ్రీనివాస్‌, తెలుగుయువత నాయ కుడు రాజుల పాటి ఫణి, అప్పలనాయుడు, తేజ, దూపం శివ తది తరులు తానా అధ్యక్ష, ఉపాధ్యక్షులను కలసి అభినందించారు.  

Advertisement
Advertisement