Abn logo
May 31 2020 @ 22:47PM

చరణ్‌తో సినిమా రూమరే: దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చరణ్ బర్త్‌డే కానుకగా చిత్రయూనిట్ విడుదల చేసిన స్పెషల్ వీడియో.. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపింది. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మహేష్ బాబు వదిలేసిన సబ్జెక్ట్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అని, ‘ఆచార్య’ తర్వాత కొరటాలతో చరణ్ సినిమా అని.. ఇలా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. ఇటీవల కొత్తగా ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఫిక్స్ అంటూ వార్తలు వినిపించాయి.


దీంతో ఇంకేముంది యంగ్ దర్శకుడికి చరణ్ అవకాశం ఇచ్చాడంటూ ఒకటే వార్తలు. గౌతమ్ తిన్ననూరి తక్కువ సినిమాలు చేసినప్పటికి వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. అతని టాలెంట్‌‌ను చరణ్ గుర్తించాడు.. ఖచ్చితంగా వారి కాంబోలో సినిమా ఉంటుంది అంటూ అన్ని వెబ్‌సైట్స్‌లో వార్తలు వచ్చేశాయి. అయితే ఈ వార్తలో నిజం లేదంటూ గౌతమ్ తిన్ననూరి స్పందించినట్లుగా తెలుస్తుంది. అసలు అలాంటి చర్చలేమీ జరగలేదని, సోషల్ మీడియాలో వినిపిస్తున్నది నిజం కాదని, అది ఒక రూమర్ మాత్రమే అని గౌతమ్ తిన్ననూరి తెలిపినట్లుగా సమాచారం. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమా ఏమిటి? అనే దానిపై మరోసారి మెగాభిమానుల్లో సస్పెన్స్ మొదలైంది. 

Advertisement
Advertisement
Advertisement