Abn logo
Oct 9 2020 @ 13:05PM

ఉపాధ్యాయురాలికి వింత వ్యాధి.. నయంకాదన్న మనస్థాపంతో..

Kaakateeya

వింతవ్యాధి సోకడంతో మనస్థాపానికి గురై బలవన్మరణం


మొయినాబాద్‌ (రంగారెడ్డి): వింత వ్యాధితో బాధపడుతూ, ఇక ఈ రోగం నయం కాదనే మనస్థాపంతో ఓ ప్ర భుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్నసంఘటన మొయినాబాద్‌ మండల కేంద్రంలో గురు వారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌ గ్రామానికి చెందిన శైలజ(29) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మొయినాబాద్‌ మండలం ఎల్కగూ డ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయుతే లక్షమందిలో ఒక్కరికి వచ్చే లూకాస్‌ అనే వ్యాధితో శైలజ బాధపడేది. ఆమె తలపై వెంట్రుకలు ఊడిపోవడంతో పాటు శరీరం మీద మచ్చలు ఏర్పడ్డాయి. వ్యాధి తగ్గించుకోవడానికి కార్పొరెట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. 


కాగా ఈ వ్యాధికి సరైన వైద్యం లేక అందుబాటులో ఉన్న వైద్యాన్ని వైద్యులు అందించారు. ఈ వ్యాధితో శైలజ రోజురోజుకూ మానసిక క్షోభకు గురైంది. గురువారం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తీసుకురావాలని భర్తకు చెప్పి ఎంఈవో కార్యాలయానికి పంపింది. భర్త అక్కడికి వెళ్లిన తర్వాత పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చి చూసే వరకు ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. శైలజకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement