Abn logo
Jun 4 2020 @ 02:47AM

విదేశీ వ్యాపారులు భారత్‌కు రావొచ్చు

  • వైద్య వృత్తి నిపుణులు, ఇంజనీర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం 


న్యూఢిల్లీ, జూన్‌ 3: లాక్‌డౌన్‌ తర్వాత మొదటిసారిగా విదేశీ వ్యాపారులు, వైద్య వృత్తి నిపుణులు, ఇంజినీర్లు భారత్‌కు రావడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయి తే ఆయా కేటగిరీలను బట్టి కొత్త వీసాలు పొందాల్సి ఉంటుందని పేర్కొంది. ఈమేరకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌కు రావాల్సిన అవసరం ఉన్న విదేశీయులపై వీసా, ప్రయాణ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాల్సిన అంశాన్ని ప్రభు త్వం పరిశీలించినట్టు తెలిపింది. లాంగ్‌టర్మ్‌ మల్టీ ఎంట్రీ బిజినెస్‌ వీసా కలిగిన వి దేశీయులు భారత మిషన్స్‌ వద్ద తమ ప్రయాణ పత్రాలను పునఃధృవీకరణ చేయించుకోవాలని తెలిపింది. బిజినెస్‌ వీసాపై విదేశీ వ్యాపారులు నాన్‌ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ లేదా చార్టర్డ్‌ ఫ్లైట్లలో రావడానికి అనుమతిచ్చారు. విదేశీ వైద్య వృత్తి నిపుణు లు, ఆరోగ్య పరిశోధకులు, ఇంజినీర్లు, లాబొరెటరీలు, ఫ్యాక్టరీల్లో పని చేసే టెక్నీషియన్లు భారత్‌కు రావడానికి భారత్‌లో గుర్తింపు పొందిన, రిజిస్టర్‌ అయిన హెల్త్‌కేర్‌ కేంద్రం, రిజిస్టర్డ్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ లేదా అక్రిడిటెడ్‌ యూనివర్సిటీ నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇన్విటేషన్‌ పొందాలి. భారత్‌లో ఉన్న విదేశీ వ్యాపార సంస్థల తరఫున విదేశీ ఇంజినీరింగ్‌, మేనేజిరియల్‌, డిజైన్‌ లేదా ఇతర స్పెషలిస్టులు భారత్‌కు రా వొచ్చు. వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్‌, డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌, ఐటీ, ఆర్థిక రంగ కంపెనీలు  ఉన్నాయి. విదేశాల్లో తయారైన మెషనరీ, ఎక్వి్‌పమెంట్‌ భారత్‌లో ఇన్‌స్టాల్‌, రిపేర్‌ మెయింటెనెన్స్‌ చేయడానికి భారత్‌కు రావాలనుకునే విదేశీ టెక్నికల్‌ స్పెషలిస్టులు, ఇంజినీర్లు నమోదైన భారత వ్యాపార సంస్థ నుంచి ఆహ్వానం ఉండాలి. 


Advertisement
Advertisement
Advertisement