Abn logo
Jul 13 2020 @ 15:13PM

కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి డీకే అరుణ

నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి): కుల, మత, వర్గ విద్వేషం లేకుండా సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలను చేరవేయాలనేది నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ అన్నారు. కరోనా విస్తృతిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె దుయ్య బట్టారు. ఆదివారం జూమ్‌యాప్‌ ద్వారా నిర్వ హించిన సమావేశంలో నాగర్‌కర్నూల్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రచార ఆర్భాటం తప్ప కేసీఆర్‌ దేనికీ పనికిరారని, కరోనాతో జనం అల్లాడుతుంటే వారికి సరైన వైద్య సదుపాయం అందజేయకపోగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా ఆమె అభివ ర్ణించారు. కొత్త సచివాలయం కోసం ఆఘమేఘా లపై నిర్ణయాలు తీసుకోవడం వెనక ఆంతర్యమేం టని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనను గాలికొ దిలేసి 13రోజులపాటు ఫామ్‌హౌజ్‌లో గడిపిన కేసీ ఆర్‌ కేంద్రం విడుదల చేసిన దాదాపు రూ.7వేల కోట్ల నిధుల గురించి ఎందుకు బయట చెప్పడం లేదని ప్రశ్నించారు. కరోనాను అరికట్టేందుకు  కేం ద్రం పంపించిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగట్టడానికి అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి దళిత మోర్చా జాతీయ నాయకురాలు బంగారు శ్రుతి, బీజేపీ నాగర్‌కర్నూల్‌ నియోజకవ ర్గ ఇన్‌చార్జి దిలీపాచారి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడుగులు, బలహీన వర్గాల కోసం విడుదల చేసిన నిధులు లబ్ధిదారుల కు సక్రమంగా అందేటట్లు చూడాలని పిలుపుని చ్చారు. సమావేశంలో బీజేపీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. 

Advertisement
Advertisement