Abn logo
Aug 3 2021 @ 23:55PM

గోవిందప్ప అంత్యక్రియలు పూర్తి

గోవిందప్ప భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మాజీ క్రీడాకారులు

పుంగనూరు రూరల్‌, ఆగస్టు 3: జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు  అక్కెం గోవిందప్ప అంత్యక్రియలు మంగళవారం  జరిగాయి. స్థానిక కోనేటిపాళ్యంలోని ఆయన స్వగృహం నుంచి పూలతో అలంకరించిన శాంతిరథంపై ఆయన భౌతిక కాయాన్ని ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లి  అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోషియేషన్‌ కార్యదర్శి పురుషోత్తం, మాజీ క్రీడాకారులు నవాజ్‌, హేమంత్‌కుమార్‌, నానబాలగణేశ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు రామచంద్ర, చంద్ర, వెంకటేశ్‌, భరత్‌భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.