Abn logo
Oct 10 2020 @ 02:57AM

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి 

జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ 


ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర రూరల్‌/శామీర్‌పేట రూరల్‌/మేడ్చల్‌/ మేడ్చల్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌/శామీర్‌పేట: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని ప్రతా్‌పసింగారం, కొర్రెముల, కాచవానిసింగారం గ్రామాల్లో శుక్రవారం జడ్పీ చైర్మన్‌ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండుగలకు సముచితస్థానం కల్పించిందని గుర్తుచేశారు. బతుకమ్మ, రంజాన్‌, క్రిస్‌మస్‌ పండుగలకు ఆయా వర్గాల మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పేదింటి మహిళలు అభివృద్ధి చెందాలని కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలతో చేయూత అందిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ జంగమ్మ, సర్పంచులు శివశంకర్‌, వెంకటే్‌షగౌడ్‌, వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచులు అబేదాబేగం, రాజు, విష్ణుగౌడ్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో పద్మలత, కార్యదర్శులు నరేష్‌, కవిత, వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ వినోద, వార్డుసభ్యులు లలిత, దుర్గరాజుగౌడ్‌, భార్గవి, సునీత, గుమ్మడవెల్లి భాస్కర్‌, స్వామి, సుష్మ, లక్ష్మీ పాల్గొన్నారు. అవుశాపూర్‌లో శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని ఘణపురం, వెంకటాపూర్‌, అంకుశాపూర్‌ తదితర గ్రామాల్లో సర్పంచులు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కావేరిమశ్చేందర్‌రెడ్డి, జలజాసత్యనారాయణ రెడ్డి, గీతాశ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచులు అయిలయ్యయాదవ్‌, సత్యనారాయణగౌడ్‌, వార్డుసభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండి, 19 సంవత్సరాల పైబడి ఉన్న మహిళలందరికీ బతుకమ్మ చీరలను అందజేశారు. నాగారం మున్సిపాలిటీకి 4,688, దమ్మాయిగూడకు 4వేలు బతుకమ్మ చీరలు వచ్చాయి.


వీటిని ఈ నెల 12వరకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు వాణి, స్వామి, వైస్‌చైర్మన్లు మల్లే్‌షయాదవ్‌, నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు తేళ్ళ శ్రీధర్‌, తిరుపతిరెడ్డి, నాయకులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శామీర్‌పేట పరిధిలో తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ కారింగుల రాజేశ్వర్‌రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు రజిని, రాజు, నర్సింగ్‌గౌడ్‌, సురేష్‌, నర్సింగరావు, కోఆప్షన్‌ సభ్యురాలు మిర్జా షఫీయుల్లాబేగ్‌, మేనేజర్‌ శ్రవణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రాణి, నాయకులు కృష్ణారెడ్డి, ఆంజనేయులు, ప్రణయ్‌, సంతోష పాల్గొన్నారు. మేడ్చల్‌ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం చేసినట్లు ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి తెలిపారు.


శుక్రవారం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో 10,058 చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు మంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా కారక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి చీరలను పంపిణీ చేశారు. కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ పరిధిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనియాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కౌన్సిలర్లతో కలిసి వార్డుల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు వెంకట్‌రెడ్డి, రమాదేవి, సంగీత, ఆంజనేయులుగౌడ్‌, అనురాధ, హేమలత, శశికళ, మల్లేష్‌, పద్మారావు, జహంగీర్‌, నర్సింగ్‌రావు, రవీందర్‌, కోఆప్షన్‌ సభ్యులు సురేందర్‌రెడ్డి, షౌకత్‌మియా, అరుణ పాల్గొన్నారు. శామీర్‌పేట మండలం తూంకుంటలో శుక్రవారం జడ్పీ ఉన్నత పాఠశాలలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. శామీర్‌పేటలో శనివారం ఉదయం 11 గంటలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ ఎల్లూభాయి తెలిపారు. 

Advertisement