Abn logo
Jul 9 2020 @ 05:32AM

కృష్ణమ్మతో ఈ నేలను తడుపుతా

 ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు


అచ్చంపేట, జూలై 8: మిగిలిపొయిన కేఎల్‌ఐ కాల్వ పనులను పూర్తిచేసి ఈ ప్రాంత నేలలను కృష్ణమ్మతో తడుపుతానని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్ళ, పూర్య, సీబీతండా పంచాయతీల్లో బుధవారం పర్యటించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పునుంతల, అచ్చంపేట మండలాల దిగువన ఉన్న గ్రామాలకు సాగు నీరు అందించేందుకు పుల్జాల నుంచి చంద్రాసాగర్‌ వరకు మిగిలిన కాలువ నిర్మాణ పనులు చేపట్టి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. హరిత తెలంగాణగా ప్రపంచంలోనే గుర్తింపు పొందాలన్నారు. 


నిత్యావసర వస్తువులు పంపిణీ ధనలక్ష్మి ట్రస్టు ఆధ్వర్యంలో పూర్య, సీబీతండా పంచాయతీల్లో పేదలకు  ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులను గువ్వల బాలరాజు అందించారు. జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌, సర్పంచ్‌లు వెంకటయ్య, సేవ్యతో పాటు మాజీ సర్పంచ్‌ చంద్రశేకర్‌ రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి ట్రస్టు చైర్మన్‌ ధనలక్ష్మి, డైరెక్టర్‌ శ్రీధర్‌ సభ్యులు చక్రవర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement